మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువు: జగన్

  • బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగన్
  • ప్రపంచ స్థాయి విద్యకు పెద్ద పీట వేస్తున్నామని వ్యాఖ్య
  • అంగన్ వాడీల నుంచి కాలేజీల వరకు సంస్కరణలను తీసుకొచ్చామన్న సీఎం
బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచ స్థాయి విద్యకు పెద్ద పీట వేస్తూ, ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకొచ్చామని చెప్పారు. మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యతను పెంచామని తెలిపారు. అంగన్ వాడీల నుంచి కాలేజీల వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలోని బాలబాలికలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Jagan
YSRCP
Childrens Day

More Telugu News